పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులకు మరో అదిరిపోయే న్యూస్ సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu)తో ఫ్యాన్స్‌ను అలరించిన పవన్.. తాజాగా ఓజీ టీజర్(OG Teaser) విడుదల చేసి మాంచి ట్రీట్ ఇచ్చాడు. ఇక అభిమానులకు మరో సారి సర్ర్పైజ్ అందించేందుకు పవన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓజీ” (Original Gangster) మూవీ టీమ్ సాలిడ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అందించనుంది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం, సుజీత్ దర్శకత్వంలో DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇప్పటికే తన యాక్షన్-ప్యాక్డ్ టీజర్‌తో అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ఈ సందర్భంగా, ఆగస్టు 15న ఒక భారీ అప్‌డేట్ విడుదల కానుందని టాక్.

టీజర్ 2.0 లేదా ఒక స్పెషల్ సాంగ్ ప్రోమో?
తాజా సమాచారం ప్రకారం, ఈ సర్ప్రైజ్(Surprise) సినిమా టీజర్ 2.0 లేదా ఒక స్పెషల్ సాంగ్ ప్రోమో(Special Song Promo) కావచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇమ్రాన్ హష్మీ(Imran Hashmi) విలన్ పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక మోహన్(Priyanka Mohan) కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో రూపొందుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా కావడంతో, ఈ సర్ప్రైజ్ ఒక కొత్త క్యారెక్టర్ రివీల్ లేదా యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన గ్లింప్స్ కావచ్చు. అలాగే, ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఒక పవర్‌ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇన్‌సైడర్స్ చెబుతున్నారు.
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధం
ఈ సర్ప్రైజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్వాతంత్ర్య దినోత్సవ ట్రీట్(Independence Day treat)గా ఉంటుందని, సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. సెప్టెంబర్ 25న విడుదల కానున్న “ఓజీ” బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. ఈ అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






