
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి(Special autonomy)ని కల్పించిన Article 370ని రద్దు చేసి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నిర్ణయం దేశ ఐక్యత, సమానత్వాన్ని బలోపేతం చేసే దిశగా వేసిన ఒక చారిత్రాత్మక ముందడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ చట్టం రద్దుతో జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలు (జమ్మూకశ్మీర్, లద్దాక్)గా విభజించారు.
అన్ని రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని పెంపొందించింది
ఈ ఆరో వార్షికోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఈ నిర్ణయం దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని పెంపొందించిందని, జాతీయ సమగ్రత(National integrity)ను మరింత బలపరిచిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో పాలన, మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి రంగాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని ఆయన నొక్కి చెప్పారు. అధికారిక గణాంకాల ప్రకారం, 2019 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతంలో సుమారు 5,600 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని, మరో 66,000 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ పరిణామాలు కశ్మీర్ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని అన్నారు.
Pawan Kalyan greets people on 6th anniversary of abrogation of Article 370https://t.co/jCJMjryg5x#Article370 #PawanKalyan #JammuAndKashmir #Ladakh #IndiaIntegration #JanaSena #BJP #NationBuilding #PeaceInKashmir #ModiGovernment
— YesPunjab.com (@yespunjab) August 5, 2025