
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా, హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) జంటగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(Harihara Veeramallu). ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా… ఇప్పుడు మళ్లీ గాడిలో పడింది. అతి త్వరలోనే రిలీజ్ కానుంది హరిహర వీరమల్లు. అయితే ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna) దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పిరియాడిక్ సినిమాగా ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఈనెల 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాల(Promotional programs)కు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఈరోజు (జులై 3)న హరిహర వీరమల్లు ట్రైలర్(Trailer)ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Just one look is enough to know what’s coming 🤩💥⚔️🔥#HHVMTrailer #HariHaraVeeraMallu pic.twitter.com/tpt0wBY9Ds
— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 2, 2025
హరిహర వీరమల్లు ట్రైలర్ 3:01 నిమిషాలు
ఈ మేరకు ఈరోజు ఉదయం 11:10 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మరో కీలక అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. హరిహర వీరమల్లు ట్రైలర్ 3:01 నిమిషాల పాటు ఉంటుందని ఈ సందర్భంగా చిత్ర బృందం(Makers) ఓ పోస్టును కూడా వదిలింది. దీంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాగా హరిహర వీరమల్లు సినిమా సెన్సార్(Censor) పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ట్రైలర్ విడుదల అవుతున్న నేపథ్యంలో అంచనాలు కూడా సినిమాపై భారీగా పెరిగాయి.