పవన్ కళ్యాణ్ మూవీ వాయిదా? హరిహర వీరమల్లు’ కొత్త తేదీ కోసం ఎదురుచూపులు

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్‌ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’ మొదట జూన్ 12న విడుదల కావాల్సి ఉండగా, తాజా సమాచారం ప్రకారం ఈ తేదీకి విడుదల కావడం కష్టమేనని తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో సినిమా విడుదల మరోసారి వాయిదా పడనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వాయిదాకు కారణం గ్రాఫిక్ వర్క్ పూర్తి కాలేదన్న విషయమే ప్రధానంగా వినిపిస్తోంది. ఈ పనులను పూర్తి చేయడానికి మరికొంత సమయం పడవచ్చని తెలుస్తోంది.

నిర్మాత ఎ.ఎం. రత్నం, సినిమా విడుదలకు సంబంధించిన టికెట్ ధరలు, ప్రత్యేక షోల వంటి అంశాలపై అనుమతుల కోరుతూ ఇటీవల ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు భరత్‌ భూషణ్‌ను కలిసి చర్చించినట్టు సమాచారం. దీనితో పాటు, ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి థియేటర్లను బ్లాక్ చేయవద్దని నిర్మాత ఇప్పటికే సూచించినట్టు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. కొత్త విడుదల తేదీపై భిన్నమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను జూన్ 20 లేదా 27న విడుదల కోసం మేకర్స్ ప్రయత్నిస్తున్నారని గుసగుసలు కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక జూన్‌లో సినిమా విడుదల కాకపోతే, జూలైలో ‘హరిహర వీరమల్లు’ థియేటర్లలోకి వచ్చే అవకాశముందని టాక్‌. అయితే అప్పటి షెడ్యూల్ ప్రకారం ఏ సినిమా వెనక్కి తగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో సోషల్‌ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. అన్ని ఊహాగానాలకు తెరదించాలంటే, మేకర్స్‌ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *