ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu), ఓజీ ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు నుంచి ఇటీవలే వరుస అప్డేట్స్ వచ్చాయి. కానీ మిగతా రెండు చిత్రాల నుంచి చాలా రోజులుగా అప్డేట్స్ ఏం లేవు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజాసేవలో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాలకు డేట్స్ కుదరడం లేదు. ఫలితంగా సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి.
ఓజీ రిలీజ్ అప్పుడే!
అయితే ఈ మూడు చిత్రాల్లో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకుంది సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ (OG)’ మూవీపైనే. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం గురించి మాత్రం అప్డేట్స్ ఏం రావడం లేదు. ఈ మూవీని గతేడాది సెప్టెంబరులో విడుదల చేస్తారని మొదట టాక్ వినిపించింది. కానీ పవన్ షూటింగుకు హాజరు కాలేకపోవడం వల్ల అది వాయిదా పడింది. ప్రస్తుతం పవన్ డేట్స్ కోసం దర్శకుడు ఎదురుచూస్తున్నాడు. అయితే ఈ ఏడాది సెప్టెంబరులోనే తప్పకుండా ఈ సినిమా విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
ఓజీ టీజర్ టాక్
అయితే ఓజీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఓటీ టీజర్ రిలీజ్ (OG Teaser News) గురించి. ఏప్రిల్ లో ఈ సినిమా టీజర్ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన జారీ చేయాల్సి ఉంది. ఇక ఓజీ సినిమా సంగతికి వస్తే ఇందులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ఫీమేల్ లీడ్ లో కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.






