Mana Enadu : ‘సినిమా విడుదలైన రోజు ప్రతి నటుడికి ప్రేక్షకులకు సినిమా నచ్చిందా లేదా అన్న టెన్షన్ ఉంటుంది. ప్రతి నటుడు ప్రేక్షకుడిని నుంచి ప్రశంసలు కోరుకుంటాడు. అందుకే సినిమా థియేటర్‌కు వెళ్లి చూస్తాడు. నా మూడో సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి నేను థియేటర్ కు వెళ్లి సినిమా చూడటం మానేశాను.’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మంగళగిరిలో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలపై స్పందించారు.
థియేటర్‌కు వెళ్లడం మానేశాను
‘‘నేను నా మూడో సినిమా తర్వాత థియేటర్ కు వెళ్లడం మానేశాను. ఇప్పుడు నేను థియేటర్‌కు వెళ్లి సినిమా చూడను. అలా చేస్తే ప్రేక్షకుల అనుభూతి పాడు చేసినట్లవుతుంది. నేను థియేటర్ (Theatre) \కు వెళ్తే వాళ్లు సినిమా చూడటం మానేసి నా పైనే దృష్టి పెడతారు. మూవీ చూడాలన్న ఫీల్ పోతుంది. అందుకే నేను థియేటర్‌కు వెళ్లడం మానేశాను. సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రతి నటుడికి ఉంటుంది. బహుశా అల్లు అర్జున్ (Allu Arjun) అందుకే థియేటర్‌కు వెళ్లి ఉంటారు.
తన నటనను ప్రేక్షకులు మెచ్చుకుంటే చూడాలని ప్రతీ నటుడు కోరుకుంటారు, జరిగిన ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడిదే తప్పు అనడం సరికాదు, మూవీ టీమ్ సమయానికి స్పందించి ఉంటే ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదు – ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు pic.twitter.com/LwJd3hqCZ7
— JanaSena Party (@JanaSenaParty) December 30, 2024
అందుకే థియేటర్ కు వెళ్లాలనుకుంటాం
సినిమా బాగాలేకపోతే తిడతారు. బాగుంటే ప్రశంసిస్తారు. అందరికీ స్తుతించడం కావాలి. మీరు (విలేకరులు) ఆర్టికల్ రాస్తే, ‘బాగుంది’ అంటే సంతోష పడతారు. అలాగే నటులు కూడా తన నటనకు ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారో చూడాలనుకుంటారు. వాళ్ల నుంచి వచ్చే ప్రశంస వెలకట్టలేం. అందుకే నటులు థియేటర్‌కు వెళ్లాలనుకుంటారు. కొన్నేళ్లుగా చాలా మంది హీరోలు విడుదల రోజున థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం మానేశారు.
అలా చేయకపోతే పొగరనుకుంటారు
నేను బయటకెళ్తే జనాలు నన్ను చూడటానికి వస్తుంటారు. కొన్నిసార్లు నాకు బందోబస్తుగా వచ్చిన పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. హీరోలు, నాయకులు బయటకు వచ్చి అభివాదం చేయకపోతే పొగరనుకుంటారు. సంధ్య థియేటర్ ఘటన (Sandhya Theatre Case) విషయంలో జరిగింది ఏంటంటే, మానవతా దృక్పథం లోపించింది. సినిమా వాళ్లు కూడా కొన్ని తప్పులు సరిదిద్దుకోవాలి. క్రమశిక్షణగా ఉండాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గ్లోబల్‌గా మరింత రాణించాలి. సాహిత్యం నేపథ్యంతో కూడిన స్కూల్, స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ రావాలి. కల్చరల్ స్కూల్స్ రావాలి.’’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.







