పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కమిటై ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఓజీ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) షూటింగ్ పనులను వేగంగా పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు, ఈ సినిమా తొలి షెడ్యూల్ 30 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా జరగనుంది. ఇందులో ప్రధాన పాత్రలతో పాటు పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కానుందట.

ఈ క్రమంలోనే ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? అనే దానిపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకొచ్చింది. ఆయనకు ఏకంగా 170 కోట్ల రూపాయలు ఇస్తున్నారట మేకర్స్. ఈ విషయం తెలిసి పవర్ స్టార్ రేంజ్ ఇదీ అంటూ తెగ సంబర పడుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.
గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన కోట శ్రీనివాస రావు.. ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే?
ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం టాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ హైప్ నడుమ చాలాకాలంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పుడు స్పీడు పెంచిన టీం పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ సిద్ధం చేస్తోందట. ఈ నేపథ్యంలోనే వరుస అప్ డేట్స్ వదులుతూ అంచనాలకు రెక్కలు కడుతున్నారు మేకర్స్.






