పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu)’. ఈ చిత్రం జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీమియర్ షో(Premiere Shows)ల నిర్వహణ కోసం తీవ్రంగా కృషి చేస్తోందని తాజా సమాచారం. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, 17వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ నటనతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం. రత్నం(AM Ratnam) నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ పొందింది. 2 గంటల 42 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రీమియర్ షోల కోసం ఓవర్సీస్ బయ్యర్స్‌తో సహా పలు థియేటర్లలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా సాయంత్రం 6 గంటలకు ప్రీరిలీజ్ ఫంక్షన్(Pre-release event) ఉండబోతోందని పేర్కొంది. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నట్లు ఏకంగా 300,000 మంది ఇంట్రెస్ట్ చూపించారు. ఇలా ఓ హిస్టారికల్ చిత్రంగా రాబోతున్న సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తుండటం నిజంగా విశేషం.
PreRelease Event On 21st Starts 6 PM Onwards nwards At Shilpakala Vedika, HYD 🦅🦅#HHVMTrailer #HariHaraVeeraMallu#AllTimeRecord pic.twitter.com/3DdDwKalGr
— pk_cultz 🦅🥋 (@Pk_cultz) July 18, 2025
టికెట్ ధరలు ఇలా ఉండొచ్చు
ఇక ప్రీమియర్ షోల కోసం మేకర్స్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 24న సినిమా రిలీజ్ కానుండగా 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలకు అనుమతించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. టికెట్ ధరలు ఏపీలో సింగిల్ స్క్రీన్-రూ.230, మల్టీప్లెక్స్-రూ.295, తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ.265, మల్టీప్లెక్స్‌లో రూ.413 వరకూ ఉండొచ్చని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.






