పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు(Harihara Veeramallu)’. డైరెక్టర్లు క్రిష్ జాగర్లమూడి, AM జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. పవన్ చాలా గ్యాప్ తర్వాత, పైగా AP డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేస్తున్న తొలి మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వీరమల్లుగా నటిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్య(Mughal Empire) కాలంలో జరిగే సంఘటనల ఆధారంగా, ఒక విప్లవాత్మక యోధుడి గాధగా ఈ కథ సాగనుంది.

ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధం
ఈ చిత్రంలో నిధి అగర్వాల్(Nidhi Agarwal) కథానాయికగా కనిపించనుండగా, ప్రముఖ బాలీవుడ్ నటులు బాబీ డియోల్(Bobby Deol), అనుపమ్ ఖేర్(Anupam Kher) కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు ఈ సినిమాను నిర్మించగా, ఎ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వచ్చింది. కొవిడ్ ఎఫెక్ట్, పవన్ పాలిటిక్స్ కారణంగా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆరు భాషల్లో ఒకేసారి..
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్(Post Production Works) షర వేగంగా కొనసాగుతున్నాయట. డబ్బింగ్, రీరికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి భాగాలు త్వరితగతిన పూర్తి చేస్తుండటం విశేషం. ఈ చిత్రం 2025 మే 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చారిత్రక నేపథ్యంలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.






