Pawan Kalyan’s OG: సాయంత్రం 4:05 గంటలకు పవన్ మూవీ నుంచి అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ (OG) సినిమా నుంచి సెకండ్ సింగిల్(Second Single) రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు ప్రకటించనుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘తుఫాన్ ఆగిపోయింది.. ఇప్పుడు గాలి వీస్తోంది’ అంటూ ఒక ఆసక్తికరమైన పోస్ట్‌తో అభిమానుల్లో అంచనాలను రెట్టింపు చేసింది. ఈ ప్రకటన సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. సుజిత్(Director Sujit) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు SS తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల నిర్మాత DVV దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Pawan Kalyan OG Release Date Announced | cinejosh.com

సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్‌కి జోడీగా ప్రియాంక మోహన్(Priyanka Mohan) కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ(Imran Hashmi) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామాగా, ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో రూపొందుతోంది.’OG’ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమన్ సంగీతం, సుజిత్ దర్శకత్వం, పవన్ కళ్యాణ్ యాక్షన్ అవతార్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్(Box-Office) వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది. సెకండ్ సింగిల్ పాట కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *