మినీ ప్రపంచకప్‌గా పేరొందిన ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) నిర్వహణ వేదికపై సందిగ్ధం వీడినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ వచ్చే ఫిబ్రవరిలో పాకిస్థాన్(Pakistan)లో జరగాల్సి ఉంది. అయితే భారత్-పాక్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో టీమ్ఇండియా(Team India) ఆ దేశంలో పర్యటించదని బీసీసీఐ(Board of Control for Cricket in India) తేల్చి చెప్పింది. అయితే భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లను వేరే దేశంలో నిర్వహిస్తే (Hybrid model) మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటామని భారత్ చెప్పింది. దీంతో టీమ్ఇండియా మ్యాచ్‌లను UAEలో నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డును ICC కోరింది. దీనికి పాక్ బోర్డు తొలుత ఒప్పుకోలేదు. అయితే శనివారం జరిగిన సమావేశంలో పాక్ దీనికి ఒప్పుకున్నట్లు సమాచారం.
* టీమ్ఇండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో..
అయితే దీనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా PCB, ICC మధ్య జరగిని సమావేశంలో ఓ ఒప్పందం కుదిరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతి(Hybride Model)లో జరిపేందుకు పీసీబీ అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్(Rashid Latif) ధ్రువీకరించారు. భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా దుబాయ్ వేదికగానే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా జరుగుతాయని తెలిపారు.
భారత్ నాకౌట్‌కు చేరుకుంటే ఆ మ్యాచ్‌లు పాక్‌లోనే
“BCCI, PCBలతో ICC చర్చలు జరిపింది. ఈ క్రమంలో ఇరు బోర్డులు కూడా ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో జరిపేందుకు అంగీకరించాయి.” అని లతీఫ్ అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాక్ వద్దే ఉంటాయని.. అయితే భారత్ ఆడే మ్యాచ్‌లు మాత్రం దుబాయ్(Dubai) వేదికగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. భారత్ నాకౌట్‌కు చేరుకుంటే సెమీఫైనల్, ఫైనల్(Semis & Final) మ్యాచ్‌లు పాకిస్థాన్ వెలుపల జరుగుతాయి. అలాగే టోర్నీకి తమకు వచ్చే ఆదాయాన్ని పెంచాలి. 2031 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీలను పాక్ కూడా హైబ్రిడ్ విధానంలోనే ఆడుతుంది’’ అని లతీఫ్ తెలిపారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనుంది.
🚨 Breaking on Champions Trophy 🚨
PCB has accepted the hybrid model. India's matches will be played on India only! 🇮🇳#ChampionsTrophy2025 #PCB #ICC pic.twitter.com/1kApNz7bP5
— Sarcasm (@sarcastic_us) November 30, 2024








