
వరుస విమాన ప్రమాదాలు ప్రజలు తీవ్రంగా భయపెడుతున్నాయి. మొన్న అహ్మదాబాద్ ఎయిరిండియా ఘటన(Ahmedabad Air India incident), నిన్న బంగ్లాదేశ్‌లో జెట్ క్రాష్(Jet crash in Bangladesh) వంటి ఘటనలు మరువక ముందే మరో భారీ విమానం ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక విషయానికొస్తే అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భయానక ఘటన చోటుచేసుకుంది. డెన్వర్ నుంచి మియామీకి బయలుదేరాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్(American Airlines) విమానం AA-3023 టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా, ల్యాండింగ్ గేర్‌లో టైర్ లోపం వల్ల మంటలు చెలరేగి, రన్‌వేపై దట్టమైన పొగలతో మంటలు(Fire with smoke) వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానం టేకాఫ్‌ను రద్దు చేశాడు. అందులోని 173 మంది ప్రయాణికులు, సిబ్బందిని అధికారులు అత్యవసరంగా, సురక్షితంగా ఖాళీ చేయించారు. ఈ ప్రక్రియలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.
విమానంలో 180 మంది ప్రయాణికులు
ఘటన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. పొగలు గమనించిన వెంటనే, పైలట్ అత్యవసర ప్రోటోకాల్‌ను అనుసరించి, విమానాన్ని రన్‌వే నుంచి టెర్మినల్‌కు తిరిగి తీసుకొచ్చారు. అగ్నిమాపక బృందాలు, అత్యవసర సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అందరినీ రక్షించారు. దీంతో ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
🚨#BREAKING: Watch as People evacuate from a American Airlines jet after a left main wheels caught fire
Watch as passengers and crew evacuate American Airlines Flight 3023, a Boeing 737 MAX 8, at Denver International Airport. The Miami-bound jet was forced… pic.twitter.com/RmUrXYj5Jp
— R A W S A L E R T S (@rawsalerts) July 26, 2025
ఇంజిన్‌లో సాంకేతిక లోపమే కారణం
ప్రాథమిక విచారణలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం(Technical fault in the engine) కారణంగా పొగలు వెలువడినట్లు తెలిసింది. నిపుణుల బృందం విమానాన్ని పరిశీలిస్తోంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి. విమాన సంస్థ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది.