హైదరాబాద్ నుంచి సంక్రాంతి(Sankranti) పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లినవారు తిరుగు ప్రయాణమయ్యారు. పొంగల్ హాలిడేస్(Pongal Holiday)ను ఫుల్‌గా ఎంజాయ్ చేసేందుకు పల్లె బాట పట్టిన సంగతి తెలిసిందే. భోగి(Bhogi), సంక్రాంతి(Sankranti), కనుమ(Kanuma)ను సొంతూరి ప్రజల మధ్య సంతోషంగా జరుపుకున్నారు. ఇక మళ్లీ బిజీ లైఫ్‌కి పరిమితం కానున్నారు. ముఖ్యంగా హైదరాబాదులో ఉంటోన్న AP వాసులు పండగకు స్వగ్రామాలకు వెళ్లే ముందు హైదరాబాద్-విజయవాడ రహదారి కిక్కిరిసిపోయింది. ఇప్పుడు తిరుగు ప్రయాణంలో విజయవాడ- హైదరాబాద్ మార్గంలో వాహనాల రద్దీ(Vehicular traffic)పెరుగుతోంది.
బస్సుల్లో రిజర్వేషన్లు ఫుల్
మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా(Pantangi Toll Plaza) వద్ద హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలోనూ వాహనాలు రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పంతంగి టోల్ ప్లాజాలోని 12 టోల్‌బూత్‌ల ద్వారా AP to Telangana వైపునకు వాహనాలను అనుమతిస్తున్నారు. ఇక్కడ బుధవారం రాత్రి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ నుంచి హైదరాబాద్ బయలుదేరడానికి రావడంతో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు తదితర బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే సర్వీసుల్లో AC బస్సుల్లో రిజర్వేషన్లు(Reservstions) నిండిపోయాయి. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు 16, 17 తేదీల్లో బస్సులన్నీ రిజర్వేషన్లతో నిండిపోయాయి. అటు రద్దీని దృష్టిలో ఉంచుకొని APSRTC విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు అదనపు బస్సులను నడుపుతోంది.
రైళ్లలోనూ భారీగా వెయిటింగ్ లిస్ట్
మరోవైపు రైళ్లన్నీ(Trains) ఫుల్ అయిపోయాయి. గోదావరి, గౌతమి, నారాయణాద్రి, విశాఖపట్నం దురంతో, వందేభారత్, శబరి, విశాఖ, గరీబ్‌రథ్, జన్మభూమి తదితర రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్టు(Waiting list) ఉంది. కొన్నిట్లో ‘రిగ్రెట్’ అని చూపుతోంది. సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో 18, 19 తేదీల్లో వెయిటింగ్‌లిస్ట్ గరిష్ఠ పరిమితి కూడా దాటేసింది. దీంతో రైల్వే శాఖ స్పెషల్ రైళ్ల(Special trains)ను కేటాయించింది.
![]()






