కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) సచివాలయం(Secretariat)లో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం(Telangana mother statue changing)పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సచివాలయం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈనెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహ ప్రతిష్ఠ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ … జూలూరు గౌరీశంకర్ పిటిషన్ దాఖలు చేశారు. విగ్రహం రూపం మార్చడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. గౌరీ శంకర్ దాఖలు చేసిన పిల్(Pill) ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ(High Court Registry) పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
ఆ కారణంతోనే మార్పు?
ఇదిలా ఉండగా తెలంగాణ తల్లి విగ్రహం (telangana thalli photo) ఇదేనంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఆకుపచ్చ రంగు చీరలో తెలంగాణ తల్లి రూపం చాలా కళగా ఉంది. చేతిలో మొక్కజొన్న, వరికంకులు, మెడలో మూడు ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు నిండుగా ఆకట్టుకుంటోంది. గత BRS సర్కార్ హయాంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం మాజీ సీఎం కేసీఆర్ (KCR) కుమార్తె కవిత(Kavitha)ను పోలి ఉందన్న విమర్శలు రావడంతో రేవంత్ రెడ్డి(Rebanth Reddy) కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్ధం చేయించారు. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట వద్ద సచివాలయ అధికారులు ఈ విగ్రహాన్ని తయారు చేయించారు.
ప్రభుత్వ నిర్ణయంపై నెటిజన్ల విమర్శ
అయితే సోషల్ మీడియా(Social Media)లో తెలంగాణ తల్లి విగ్రహం ఫొటోలు(Photos) ఇప్పుడు బాగా వైరల్(Viral) అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ తల్లి మెడలో ఆభరణాలున్నాయి కానీ అసలైన మంగళసూత్రం (Talibottu) లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయానికి, ఉద్యమానికి, స్వరాష్ట్ర సాధనకు ప్రతీక అయిన బతుకమ్మ (Bathukamma) కూడా ఈ విగ్రహంలో పొందుపరచలేదని మండిపడుతున్నారు.






