EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఇక మొత్తం డబ్బులు ఒక్కసారిగా విత్‌డ్రా చేసుకోవచ్చు!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఇప్పుడు తన సేవలను మరింత అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో పలు కీలక మార్పులను ప్రతిపాదించింది. అందులో భాగంగా, పీఎఫ్(PF) ఖాతాల నుంచి డబ్బు విత్‌డ్రా(Withdraw) చేసుకునే నిబంధనల్లో సడలింపు రానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఉద్యోగి(Emplayee) 58 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసిన తర్వాత లేదా ఉద్యోగం వదిలిన రెండు నెలల తర్వాత మాత్రమే మొత్తం పీఎఫ్ ను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. కానీ, కొత్త ప్రతిపాదన ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సభ్యులు తమ పీఎఫ్ మొత్తాన్ని లేదా దానిలో కొంత భాగాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, కెరీర్ మిడిల్‌లో మార్పులు చేయాలనుకునే వారికి, లేదా ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగం వదిలినవారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆలోచన చేస్తోంది.

అంతేకాకుండా, యూపీఐ లేదా ఏటీఎం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో లక్ష రూపాయల వరకు తక్షణ విత్‌డ్రా చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ గరిష్ట పరిమితి త్వరలోనే రూ.5 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం విత్‌డ్రావల్ కోసం అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్యను 27 నుంచి 18కి తగ్గించగా, క్లెయిమ్ ప్రక్రియ మూడు నుంచి నాలుగు రోజుల్లోనే పూర్తవుతోంది. ముఖ్యంగా, 3 సంవత్సరాల సేవ తర్వాత హౌస్ ఈఎంఐ లేదా డౌన్ పేమెంట్ కోసం పీఎఫ్ మొత్తంలో 90% వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనున్నట్టు సమాచారం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *