
గడచిన ఏడాది కాలంలో బంగారంలో పెట్టుబడి(Gold Investment) పెట్టిన ఇన్వెస్టర్లకు గణనీయమైన రాబడి లభించింది. ధరల విషయంలో బంగారం ఇప్పటికే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆల్ టైమ్ హైకి చేరింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర(Gold Rate) లక్ష రూపాయల సమీపానికి చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ ధర రూ.75,000ల వరకు ఉండగా, దాదాపు రూ.25,000 పెరిగినట్లు గణాంకాలు చూపుతున్నాయి. అంతేకాదు, 2020లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.50,000గా ఉండగా, ఇప్పటికీ పోలిస్తే దాదాపు రెట్టింపు వృద్ధి కనిపిస్తోంది.
ఈ భారీ ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలే ముఖ్య కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అస్థిరత నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ సంపదను సురక్షితంగా ఉంచుకునే మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారు.
బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు పలు మార్గాలు ఉన్నప్పటికీ, ఇంకా చాలామంది ఫిజికల్ గోల్డ్‌ను, ముఖ్యంగా బంగారు ఆభరణాల రూపంలో కొనుగోలు చేయడం చూస్తున్నాం. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారు ఆభరణాల కంటే గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) స్కీములు మరింత ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయని అంటున్నారు.
గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అయ్యే ఫండ్లలా ఉంటాయి. ఇవి డిమాట్ అకౌంట్ ద్వారా నిర్వహించబడతాయి. బంగారం ధర పెరిగే కొద్దీ ఈ ఫండ్ల విలువ కూడా పెరుగుతుంది. కొనుగోలు, విక్రయం తేలికగా ఉండటంతోపాటు దీర్ఘకాలిక పెట్టుబడికి అనుకూలమైన సాధనంగా అవి నిలుస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ప్రముఖ గోల్డ్ ఈటీఎఫ్(Gold ETF)లలో:
నిప్పాన్ ఇండియా గోల్డ్ ఇటిఎఫ్ (Nippon India Gold ETF)
ఎస్‌బిఐ గోల్డ్ ఇటిఎఫ్ (SBI Gold ETF )
హెచ్‌డిఎఫ్‌సి గోల్డ్ ఇటిఎఫ్ (HDFC Gold ETF)
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఇటిఎఫ్ (ICICI Prudential Gold ETF)
కోటక్ గోల్డ్ ఇటిఎఫ్ (Kotak Gold ETF)
యాక్సిస్ గోల్డ్ ఇటిఎఫ్ (Axis Gold ETF)
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఇటిఎఫ్ (Aditya Birla Sun Life Gold ETF)
యుటిఐ గోల్డ్ ఇటిఎఫ్ (UTI Gold ETF)
ఐడిబిఐ గోల్డ్ ఇటిఎఫ్ (IDBI Gold ETF)
ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఇటిఎఫ్ (Invesco India Gold ETF)
క్వాంటం గోల్డ్ ఫండ్ ఇటిఎఫ్ (Quantum Gold Fund ETF)
మోతిలాల్ ఓస్వాల్ గోల్డ్ ఇటిఎఫ్ (Motilal Oswal Gold ETF)
ఎడెల్వీస్ గోల్డ్ ఇటిఎఫ్ (Edelweiss Gold ETF)
Disclaimer: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. దీన్ని పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ సహా ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాల ముప్పుతో కూడుకున్నవే.పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించండి.