చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

చర్లపల్లి రైల్వే టెర్మినల్​ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వర్చువల్ గా ప్రారభించారు. అనంతరం ఈ టెర్మినల్ ను జాతికి అంకితం చేశారు. కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి నేరుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి (సోమవారం) నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్ హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సౌకర్యాలతో విమానాశ్రయం తరహాలో రూ.413 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ నిర్మించిన విషయం తెలిసిందే.

ఎయిర్ పోర్టును తలదన్నేలా

ఎయిర్ పోర్టును తలదన్నేలా ఈ టెర్మినల్ ను నిర్మించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapalli Railway Terminal) నుంచి ప్రస్తుతం 13 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుంచి మరో 12 జతల రైళ్లు నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ టెర్మినల్​లో 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్ట్‌లు, 7 బుకింగ్‌ కౌంటర్లతో పాటు పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్‌ హాళ్లు, హైక్లాస్‌ వెయిటింగ్‌ హాల్, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్​లో కెఫీటేరియా, రెస్టారెంట్‌, రెస్ట్‌రూమ్‌ సౌకర్యాలు అందుబాటులో ఉంచారు.

ఆ స్టేషన్లపై తగ్గనున్న భారం

ఈ టెర్మినల్​లో ఇప్పటికే రెండు పుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉండగా.. తాజాగా వాటికి అదనంగా మరో రెండు నూతన ఎఫ్ఓబీలు 12 మీటర్లతో ఒకటి.. 6 మీటర్లతో మరొకదాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో చర్లపల్లిలో 5 వరకు ప్లాట్ ఫారమ్ లు ఉండగా తాజాగా వాటి సంఖ్య 9కి పెంచారు. వీటిలో రెండు ప్లాట్ ఫారమ్​లను డెడికేటెడ్​గా ఎంఎంటీఎస్​లకు కేటాయించారు. ఇక నేటి నుంచి ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో నాంపల్లి (హైదరాబాద్) రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ (Secunderabad Railway Station), కాచిగూడ రైల్వేస్టేషన్లపై ప్రయాణికుల భారం తగ్గుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *