ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విశాఖకు చేరుకున్నారు. గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సిరిపురం కూడలి వద్దకు ప్రధాని మోదీ చేరుకున్నారు. సిరిపురం కూడలి నుంచి ప్రధాని మోదీ రోడ్ షోగా తరలి వస్తున్నారు. దాదాపు లక్షమందితో సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానం వరకు ప్రధాని మోదీ రోడ్ షో కొనసాగుతోంది.
లక్షమందితో రోడ్ షో
రోడ్ షోలో (PM Modi Road Show) ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభా వేదికపై నుంచే వర్చువల్ గా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక ప్రధానిని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో రోడ్ షో జరిగే మార్గం రద్దీగా మారింది.
PM @narendramodi arrived in Visakhapatnam, Andhra Pradesh a short while ago. He was received by Governor, Shri S. Abdul Nazeer, Chief Minister, Shri @ncbn, Deputy CM, Shri @PawanKalyan and other dignitaries. pic.twitter.com/2XVISLR9Vm
— PMO India (@PMOIndia) January 8, 2025








