PM Modi: ఒకే దేశం- ఒకే ఎన్నిక లక్ష్యంతో పనిచేస్తున్నాం: ప్రధాని మోదీ

Mana Enadu: దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. అలాంటి వారి కుట్రలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని ప్రధాని స్పష్టం చేశారు. సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌(Sardar Vallabhbhai Patel) జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ(Statue of Unity)’ దగ్గర మోదీ నివాళులర్పించారు. అనంతరం, సర్దార్‌ సేవలను గుర్తుచేసుకుంటూ జాతి సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేశారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక(One nation, One election) లక్ష్యంతో ముందుకెళ్లినప్పుడే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కి నిజమైన నివాళి అర్పించినట్టు ప్రధాని మోదీ అన్నారు. పటేల్‌ బాటలోనే NDA సర్కార్‌ ఒకే దేశం-ఒకే పాలసీ(One country-one policy) విధానంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఇది అమలైతే దేశ వికాసానికి దోహదం చేస్తుందన్నారు.

 పటేల్ కోరిక అదే

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మనదేశంలోని ఏకత్వాన్ని పటేల్(Patel) రక్షించారన్నారు. పటేల్ అనేక తరాలకు స్ఫూర్తి కలిగిస్తున్నారని పేర్కొన్నారు. దేశమంతా ఒక్కతాటిపై ఉండాలని పటేల్ ఎప్పుడూ కోరుకున్నారన్నారు. కొత్త లక్ష్యాల దిశగా భారత్(India towards new goals) నిరంతరం ముందుకు వెళ్లాలని పటేల్ చెప్పేవారన్నారు. మన ఉన్నతికి, వికాసానికి, ఉనికికి మూలం మాతృభాష… అందుకే స్థానిక భాషలన్నింటికీ కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఐదు భాషలకు క్లాసికల్ లాంగ్వేజెస్(Classical Languages) హోదాను ఇచ్చామని వెల్లడించారు.

ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి: మోదీ

ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని అన్నారు. ఏకతా మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనం కానివ్వబోమని మోదీ(Modi) స్పష్టం చేశారు. ఏకతా మంత్రం వల్లే దేశ ప్రగతి చక్రాలు పరుగులు తీస్తాయన్నారు. నేడు మన దేశం చేసే ప్రతి పనిలో దేశ సమైక్యత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కశ్మీర్, ఈశాన్య భారతం రైలు(Kashmir, Northeast India Rail)తో దేశానికి కనెక్ట్ అయ్యాయన్నారు. ఆయుష్మాన్ భారత్(
Ayushman Bharat) వల్ల ప్రతి వ్యక్తి లబ్ధి పొందుతాడన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *