కొత్త ఏడాదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏపీలో పర్యటించనున్నారు. ఆయన విశాఖలో పర్యటించనున్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మోదీ.. విశాఖ ఎయిర్‌పోర్టు (Visakha Airport)కు చేరుకుంటారని అధికారులు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University) ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారని వెల్లడించారు.
బహిరంగ సభలో మోదీ ప్రసంగం
ఏయూకు చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ.. ఎన్టీపీసీ (NTPC) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ప్రాజెక్టుకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. వాటితో పాటు రైల్వే జోన్ పరిపాలన భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu)తో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. అని విశాఖ జిల్లా అధికారులు తెలిపారు.
మోదీ రాకకు ఏర్పాట్లు
మరోవైపు ప్రధాని (PM Modi Visakha Visit) రాక సమాచారం అందుకున్న అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.








