ManaEnadu : హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన (Sandhya Theatre Stampede)లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు మూడున్నర గంటల పాటు విచారించారు. అనంతరం ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ క్రమంలోనే ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు పుష్ప-2 (Pushpa 2) సినిమా నిర్మాతలకు షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ (Allu Arjun A11) ను A11గా చేర్చిన అధికారులు.. తాజాగా A18గా మైత్రి మూవీ మేకర్స్‌ను చేర్చినట్లు తెలిపారు. అంతే కాకుండా A1 నుంచి A18 వరకు ఎవరెవరు ఈ కేసులు నిందితులుగా ఉన్నారో ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ కేసులో A1 నుంచి A8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్‌ను పోలీసులు నిందితులుగా చేర్చారు. A9, A10 సంధ్య థియేటర్ సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లోర్ ఇన్ఛార్జ్ను చేర్చినట్లు తెలిపారు. అలాగే A12 నుంచి A17వరకు అల్లు అర్జున్ బౌన్సర్లను చేర్చినట్లు వెల్లడించారు. మరోవైపు A18గా మైత్రి మూవీమేకర్స్ (Mythri Movie Makers)ను ఈ కేసులో చేర్చి ఆ నిర్మాణ సంస్థకు బిగ్ షాక్ ఇచ్చారు. ఇటీవలే ఈ సంస్థ రేవతి కుటుంబానికి రూ.50 లక్షల చెక్కును అందజేసిన విషయం తెలిసిందే.

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుపై పోలీసుల విచారణ
- A1 నుంచి A8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్
- A9, A10 సంధ్య థియేటర్ సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లోర్ ఇన్ఛార్జ్
- ఇప్పటికే A11గా అల్లు అర్జున్ను చేర్చిన పోలీసులు
- A12గా అల్లు అర్జున్ పర్సనల్ మేనేజర్ సంతోష్
- A13గా మరో మేనేజర్ శరత్ బన్నీ
- A14గా పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ రమేష్
- A15 నుంచి A17వరకు అల్లు అర్జున్ బౌన్సర్లు
- A18గా మైత్రి మూవీ మేకర్స్






