Mana Enadu : హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట (Sandhya Theatre Stampede) ఘటనపై పోలీసులు కీలక ప్రకటన జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ (Hyderabad Police) పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
‘‘తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. కొందరు ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన అంశం మా దృష్టికి వచ్చింది.
1. Revathi garu fell down due to unconsciousness at 9 : 16 pm.
2. while Allu Arjun came to the sandhya theatre at 9 : 34 pm..
So it was not due to a stampede .
This was completely planned on
Allu Arjun by the govt🙏#StopCheapPoliticsOnALLUARJU #AlluArjun pic.twitter.com/RfU7G0P22H— UNANIMOUS 💥 (@Unanimous_A_A) December 24, 2024
ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో (Sandhya Theatre Case Video) రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. కావాలని పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు పోస్ట్లు పెడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే మాకు అందించవచ్చు’’ అని నగర పోలీసులు ఓ ప్రకటన జారీ చేశారు.







