ManaEnadu:కొంతకాలంలో ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న టీమ్ఇండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి కోచ్ గంభీర్(Gambhir) బాసటగా నిలిచారు. వారిద్దరి సామర్థ్యంపై తనకు, జట్టుకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు. వారి ఆటతీరుపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting) పలు కామెంట్స్ చేసిన నేపథ్యంలో గౌతీ స్పందించాడు. తమ ప్లేయర్లకు ఎవరూ ఎలాంటి సలహాలు ఇవ్వనవసరం లేదని, వారికి పరుగులు ఎలా రాబట్టాలో తెలుసని పాంటింగ్‌కు కౌంటర్ ఇచ్చాడు గౌతీ. గత కొన్ని ఇన్నింగ్సులలో వీరిద్దరూ పేలవంగా ఆడుతుండటంతో విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఎవరి సలహాలు మాకు అవసరం లేదు: గౌతీ
‘విరాట్ ఎలాగైనా ఆడతాడు. ఎలాంటి మైదానంలోనైనా చెలరేగుతాడు. అతని గురించి జరుగుతున్న చర్చ సరికాదు. అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే’ అని గంభీర్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై రికీ పాంటింగ్(Ricky Ponting) స్పందించాల్సి వచ్చింది. పాంటింగ్ ఇటీవల విరాట్ కోహ్లీ పాటతీరుపై విమర్శలు చేశాడు. గత మూడు సంవత్సరాల లో విరాట్ కోహ్లీ అంతగా ఆడటంలేదని, అతడు చేసిన సంచలన సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందని వివరించాడు. దీనిపై గంభీర్ ఫైరయ్యాడు. ‘కోహ్లీ ఫామ్ గురించి పాంటింగ్ కు ఎందుకు? కోహ్లీ ఎలా ఆడతాడనేది మాకు తెలుసు. రోహిత్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో కూడా మాకు తెలుసు. దీనిపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరి సలహాలు కూడా మాకు అవసరం లేదు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
నేను వ్యక్తిగతంగా విమర్శించలేదు: పాంటింగ్
గంభీర్ వ్యాఖ్యలపై తాజాగా పాంటింగ్(Ricky Ponting) స్పందించాడు. ‘కోహ్లీపై నేను విమర్శలు చేయలేదు. ఆరోపణలు అంతకన్నా చేయలేదు. అతని ఆట తీరును మాత్రమే ప్రస్తావించాను. కొంతకాలంగా అతడు చేస్తున్న సెంచరీ(Centuries)ల సంఖ్య తగ్గిపోయిందని చెప్పాను. అంతేతప్ప నేను వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియాకు హెడ్ కోచ్(Head Coach). ఆ సోయి అతడికి లేదు. ఒకవేళ విరాట్ కోహ్లీ నన్ను అడిగినప్పటికీ ఇలాంటి సమాధానమే చెబుతాను. గతంలో అతడు సూపర్ ఫామ్‌లో ఉండేవాడు. కానీ ఇప్పుడు లేడు. వైఫల్యాల గురించి చెప్తే విమర్శించినట్టు కాదు. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు’ అని పాంటింగ్ గౌతీకి చురకలంటించాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)కి ముందు పాంటింగ్, గంభీర్ మధ్య ఇలాంటి వాదన జరగడం హాట్ టాపిక్‌గా మారింది.
Ricky Ponting has stood by his comments about Virat Kohli that lit the fuse for an explosive Indian summer. The former Aussie captain's concerns about King Kohli's recent test record were met with a stinging response from India's combative coach Gautam Gambhir. #7NEWS pic.twitter.com/vzBrRcbcXo
— 7NEWS Queensland (@7NewsBrisbane) November 12, 2024








