
టాలీవుడ్ సినీ నటుడు, వైస్సార్సీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)ని సీఐడీ పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానం సోమవారం రోజున ఉత్తర్వులు ఉచ్చింది. ఈ నేపథ్యంలో ఆయణ్ను ఇవాళ (మంగళవారం) సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోసానిని విచారించనున్నారు.
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్‌ల (Pawan Kalyan)పై గతంలో పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ చిత్రాలను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో దీనిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పోసానిని పీటీ వారెంట్‌పై కర్నూలు నుంచి గుంటూరు తీసుకువచ్చారు.
సీఐడీ కస్టడీకి అనుమతి
గత బుధవారం రోజున పోసాని కృష్ణమురళిని (Posani Case Update) పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయణ్ను జిల్లా జైలుకు తరలించారు. పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం న్యాయస్థానం అధికారులకు అనుమతి ఇచ్చింది.