Mana Enadu: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (Telangana State Electricity Regulatory Commission) రాష్ట్రంలోని సామాన్య వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ERC తిరస్కరించింది. 800Units దాటినప్పుడు ఫిక్స్‌డ్ ఛార్జీలను రూ. 10 నుంచి రూ. 50 వరకు పెంచాలంటూ డిస్కం(Discoms)లు ప్రతిపాదించాయి. అయితే, ఈ ప్రతిపాదనను ERC తిరస్కరించింది.
ఈ ప్రతిపాదనలపై ERC తన విచారణను పూర్తి చేసింది. ఇటీవల రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను సవరించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు సూచించాయి(Electricity charges should be revised). ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకు 800 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వాడితే స్థిర ఛార్జీని రూ. 10 నుంచి రూ. 50 పెంచాలని వారు చెప్పారు. ఈ ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చల తర్వాత ఈఆర్‌సీ తన విచారణను పూర్తి చేసింది.
గతంలో మాదిరిగానే ఛార్జీలు: ERC
‘అన్ని పిటిషన్ల(All petitions)పై ఎలాంటి లాప్స్ లేకుండా వెల్లడించాలని నిర్ణయించింది. 40 రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నాం. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఎనర్జీ ఛార్జీలు(Energy charges) ఏ కేటగిరిగీలో కూడా పెంచడం లేదు. స్థిర ఛార్జీలు రూ.10 యథాతథంగా ఉంటాయి. పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేదు. హెచ్‌టీ కేటగిరీలలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశాం. 132KVA, 133KVA, 11KVలలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉంటాయి. లిఫ్ట్ ఇరిగేషన్‌కు కమిషన్(Commission for Lift Irrigation) ఆమోదించింది. టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు లేదు’ అని ఈఆర్సీ పేర్కొంది.