
టాలీవుడ్ హీరోయిన్, గూఢచారి(Gudachari) ఫేమ్ శోభిత దూళిపాళ(shobita dhulipala) కథ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ హీరోయిన్ కాకపోయినా, ఆమె తన పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. బాలీవుడ్, టాలీవుడ్, వెబ్‌సిరీస్‌ల్లో తనదైన మార్క్ వేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల కంటే వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది.
నాగచైతన్య, సమంత విడాకుల తరువాత అక్కినేని నాగ చైతన్య(Akkineni Nagachaithanya)ని ప్రేమించిన శోభిత(shobita dhulipala), కొద్ది నెలల్లోనే అతనితో ఎంగేజ్మెంట్, పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ గడుపుతున్నారు. అయితే, తాజాగా శోభిత గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
శోభిత భర్త చైతు టాలీవుడ్ హీరో అయినా, ఆమె అభిమాన స్టార్ హీరో మాత్రం వేరే ఉన్నారు. ఇది కొంచం షాకింగ్‌గా అనిపించొచ్చు కానీ.. శోభిత చిన్ననాటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు వీరాభిమానిగా ఉన్నట్లు సమాచారం. పవన్ సినిమాలంటే భలే ఇష్టమాట, ఫస్ట్ డే ఫస్ట్ షో అస్సలు మిస్సవ్వదట. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాలు థియేటర్‌లో చూడడం అంటే శోభితకు ఎంతో ఇష్టమట. తన భర్త కాకుండా మరో హీరో అంటే ఈ స్థాయిలో అభిమానమా..? అనే చర్చలు కూడా సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.
కాగా, శోభిత “గూఢచారి” సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తమిళం, హిందీలో కూడా పలు ప్రాజెక్ట్స్ చేసింది. ప్రస్తుతం నటనకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఆమె.. భవిష్యత్‌లో సినీ కెరీర్‌కు గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదని టాక్ వినిపిస్తోంది.
ఇక నాగచైతన్య విషయానికొస్తే, ‘తండేల్’ వంటి హిట్ తర్వాత విరామం తీసుకుని ఇప్పుడు ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండాతో ఓ మైథికల్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఈ చిత్రం చైతూ కెరీర్‌లో 24వ సినిమా కాగా, తన 25వ ప్రాజెక్ట్‌కి కసరత్తులు జరుగుతున్నాయని సమాచారం. ఈసారి ఓ కొత్త దర్శకుడైన కిషోర్‌తో కలిసి సినిమా చేయబోతున్నాడట.