గ్లోబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “రాజాసాబ్”(Raja Saab) ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ జానర్ చిత్రంలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్, ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మేకర్స్ ఈరోజు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dutt) లుక్(Powerful Look )ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ ప్రభాస్ తాతగా నటిస్తున్నాడు, కాగా ఆయన పాత్ర పేరు “సంజూబాబా” అని పోస్టర్ ద్వారా వెల్లడించారు.
సంజయ్ దత్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో ఆయన భారీ గడ్డం, పొడవైన జుట్టుతో స్టైలిష్ మాస్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ స్టిల్ చూసిన వెంటనే ఇది పాత్రకు ఎంత హైలైట్ అవుతుందో అర్థమవుతుంది.
ఇప్పటికే ప్రభాస్ లుక్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా.. ఇప్పుడు సంజయ్ దత్ క్యారెక్టర్ పోస్టర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఓ భిన్నమైన జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
Team #TheRajaSaab wishes the Powerhouse and versatile Sanju Baba – @DuttSanjay a very Happy Birthday 💥💥
Get ready to witness a terrifying presence that will shake you to the core this Dec 5th in cinemas 🔥🔥#TheRajaSaabOnDec5th#Prabhas @DirectorMaruthi @AgerwalNidhhi… pic.twitter.com/dZsynaaJme
— BA Raju’s Team (@baraju_SuperHit) July 29, 2025






