టాలీవుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. బాహుబలి పార్ట్-2ను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. బాహుబలి : ది కంక్లూజన్ (Bahubali : The Conclusion) విడుదలై ఎనిమిదేళ్లు పూర్తైన నేపథ్యంలో ఈ సినిమా రీ రిలీజ్పై నిర్మాత శోభూ యార్లగడ్డ కీలక ప్రకటన చేశారు.
View this post on Instagram
బాహుబలి-2 రీ రిలీజ్
ఈ ఏడాది అక్టోబర్లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత శోభూ (Shobu Yarlagadda) వెల్లడించారు. “ఈ స్పెషల్ డే రోజున ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. బాహుబలి మూవీ భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్లో రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. ఇంకా కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి.” అని నిర్మాత శోభూ యార్లగడ్డ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఆల్ టైమ్ రికార్డు
ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు. తొలి భాగం 2015లో విడుదల కాగా.. రెండో పార్ట్ 2017 ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రూ. 250 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం ఆ సమయంలో దాదాపు రూ.1,800 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా బాహుబలి కొనసాగుతుంది. ఇందులో అనుష్క, రానా, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు.






