తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి: ది బిగినింగ్(Baahubali: The Beginning)’ విడుదలై 2025 జులై 10 నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రం, పాన్ ఇండియా(Panindia) ట్రెండ్‌కు ఆద్యురాలిగా నిలిచి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ప్రభాస్(Prabhas), రానా దగ్గుబాటి(Rana Daggubati), అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, రూ.250 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొంది. వెయ్యి కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డుల(industry records)ను తిరగరాసింది. ఈ పదవ వార్షికోత్సవం సందర్భంగా, ‘బాహుబలి’ రీరిలీజ్(Baahubali re-release)కు సిద్ధమవుతోంది. నిర్మాత శోభు యార్లగడ్డ(Shobhu Yarlagadda) ఈ ఏడాది అక్టోబర్ 31న ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో భారత్‌తో పాటు అంతర్జాతీయంగా గ్రాండ్ రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
#Celebrating10YearsOfBaahubali#BaahubaliTheEpic a two-part combined film#Telugu #Hindi #Tamil #Malayalam
🎟️ In theatres worldwide on October 31, 2025#Bahubali#BahubaliTheBeginning #Bahubali2 #Bahubali2TheConclusion pic.twitter.com/3ufyE1SIV4— The Cinementary (@thecinementary) July 10, 2025
కొత్త ఆకర్షణలు, సర్‌ప్రైజ్‌లతో ఫ్యాన్స్ ముందుకు..
కాగా రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా 4కే వెర్షన్‌లో తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ రీరిలీజ్ కేవలం సినిమా ప్రదర్శనతోనే కాకుండా, కొత్త ఆకర్షణలు, సర్‌ప్రైజ్‌లతో అభిమానులకు ఉత్సవ శోభను అందించనుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కువ భాగం చిత్రీకరించిన ఈ చిత్రం, కాలకేయుల యుద్ధ(Kalakeya War Scenes) సన్నివేశం కోసం 5000 మంది జూనియర్ ఆర్టిస్టులతో 250 రోజులు షూటింగ్ జరిపింది. కీరవాణి సంగీతం, పీటర్ హెయిన్ యాక్షన్ డిజైన్ ఈ సినిమాకు జీవం పోశాయి. అభిమానులు #DecadeofBaahubaliReign హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా(SM)లో సంబరాలు జరుపుతున్నారు.







