భారతీయ సినిమా చరిత్రలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘బాహుబలి: ది బిగినింగ్(Baahubali: The Beginning)’ చిత్రం విడుదలై రేపటికి పదేళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా ఈ హిస్టారిక్ చిత్రం మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ఈ ఎపిక్ మూవీలో ప్రభాస్(Prabhas), రానా దగ్గుబాటి(Rana Daggubati), అనుష్క శెట్టి(Anshka Shetty), తమన్నా భాటియా(Tamannah Bhatia) లాంటి తారాగణంతో జులై 10, 2015లో విడుదలై, పాన్-ఇండియా(Pan India) సినిమా ట్రెండ్‌కు బీజం వేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటింది.

బాహుబలి రెండు పార్టులను కలిపి ఓకే చిత్రంగా..
జులై 10, 2025న ‘బాహుబలి’ విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, చిత్ర యూనిట్ రీ-రిలీజ్(Rerelease) ప్రకటనతో అభిమానులను ఉత్తేజపరిచింది. నిర్మాత షోబు యార్లగడ్డ(Shobu Yarlagadda) నేతృత్వంలోని ఆర్కా మీడియా వర్క్స్, ఈ రీ-రిలీజ్‌లో ప్రత్యేక ఆకర్షణలతో సినిమాను మరింత గ్రాండ్‌గా అందించనున్నట్లు సూచనలు ఇచ్చింది. ‘బాహుబలి’ రెండు భాగాల కీలక సన్నివేశాలను ఒకే చిత్రంగా ఎడిట్ చేసి, సూపర్ 4K టెక్నాలజీలో ప్రేక్షకులకు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్విస్ట్ అభిమానులకు డబుల్ ట్రీట్‌గా నిలవనుంది.
ప్రపంచ వ్యాప్తంగా రీరిలీజ్ చేసే ఛాన్స్
ఈ రీ-రిలీజ్‌తో ‘బాహుబలి’ మరోసారి బాక్సాఫీస్(Box Office) వద్ద రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోషల్ మీడియాలో ‘#బాహుబలి వస్తున్నాడు’ ట్రెండ్‌తో అభిమానులు హైప్‌ను పెంచుతున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2025లో భారతదేశంతో పాటు అంతర్జాతీయంగా కూడా రీ-రిలీజ్ కానుందని సమాచారం. మరోసారి ‘బాహుబలి’ మ్యాజిక్‌ను థియేటర్లలో ఆస్వాదించడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#బాహుబలివస్తునాడు
Bahubali re-release will be soon all records in dust bin 🦖👑🦁Stay tuned #Prabhas
#bahubalireturns pic.twitter.com/wncuTVQYhq— Jaya Vardhan (@ChinnaJay6701) July 9, 2025






