విలన్ గ్యాంగ్‌లో ఉంటూ తన కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఫిష్ వెంకట్ (Fish Venkat). ఆది, అదుర్స్, గబ్బర్ సింగ్, మిరపకాయ్, నాయక్, డీజే టిల్లు తదితర సినిమాలలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. అయితే ఫిష్ వెంకట్ కొన్నిరోజులుగా ఆరోగ్యం సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీలు దెబ్బతినడంతో కుటుంబసభ్యులు ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేశారు. పరిస్థితి సీనియస్ అవడంతో ప్రస్తుతం వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
తండ్రి అనారోగ్యం గురించి ఆవేదన వ్యక్తం చేసింది
ఈ నేపథ్యంలోనే తన తండ్రి అనారోగ్యం గురించి ఆవేదన వ్యక్తం చేసింది ఆయన కూతురు స్రవంతి. ఆర్థిక సాయం చేయాలని ఓ వీడియో ద్వారా వేడుకుంది. కాగా ఆ వీడియో చూసిన పలువురు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని కొంత మేర సహాయం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇలా ఎంతోమందికి అండగా నిలిచిన ప్రభాస్ (Prabhas).. మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఫిష్ వెంకట్ వైద్య ఖర్చులన్నీ తానే కడతానని మాటిచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా స్రవంతి మీడియా ముందు తెలిపింది.
ప్రభాస్‌పై నెటిజన్ల ప్రశంసలు
హీరో ప్రభాస్ (Prabhas) టీమ్ నుంచి తనకు కాల్ వచ్చిందని. ఆయన అసిస్టెంట్ ఒకరు కాల్ చేసినట్లు చెప్పారు. కిడ్నీ ఇచ్చే డోనర్‌ను వెతకాలని, ఫిష్ వెంకట్ ఆపరేషన్‌కు కావల్సిన రూ. 50 లక్షలు ఏర్పాటు చేస్తామని వారు అని చెప్పినట్లు స్రవంతి తెలిపింది. తన తండ్రి బ్లడ్ గ్రూప్ కి మ్యాచ్ అయ్యే కిడ్నీ దానం చేసే దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయమని వేడుకుంది. తన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో తండ్రికి కిడ్నీ దానం చేయలేకపోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ గొప్ప మనసును నెటిజన్స్ మరోసారి ప్రశంసిస్తున్నారు.
Prabhas proves his golden heart again! 💛 He’s come forward to fully fund the ₹50 lakh treatment for comedian Fish Venkat, who’s on a ventilator due to severe kidney issues. 🙏#Prabhas #GoldenHeart #FishVenkat #RebelStar pic.twitter.com/KuYVzmTIl7
— 𝙎𝙪𝙣 𝙂𝙤𝙙 𝙉𝙞𝙠𝙖 ♋ (@ManojRaj023) July 4, 2025






