పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కల్కి మూవీ తర్వాత వెంటనే డార్లింగ్ మారుతితో ‘ది రాజాసాబ్ (The Raja Saab)’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెంటవెంటనే షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టాడు. కానీ షూటింగులో గాయం కావడం వల్ల కొంతకాలం గ్యాప్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాలో నుంచి ప్రభాస్ లుక్స్, గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. అయితే చాలా కాలం నుంచి ఈ చిత్రం నుంచి ఒక్క అప్డేట్ కూడా రావడం లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. రాజాసాబ్ బృందానికి ఆర్థికంగా సమస్యలు వచ్చాయని టాక్ వినిపిస్తోంది.
ఏప్రిల్ లో టీజర్ రిలీజ్
ఇదిలా ఉంచితే తాజాగా రాజాసాబ్ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా టీజర్ (Raja Saab Teaser) ను వచ్చే నెలలో రిలీజ్ చేయనున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా (Raja Saab Release Date) వేశారు. కనీసం ఇప్పుడు ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ అయినా ఇచ్చి డార్లింగ్ అభిమానులను ఖుష్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ దిశగా పనులు కూడా షురూ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
టీజర్ తో పాటు రిలీజ్ డేట్
ఇక ది రాజాసాబ్ సినిమాలో ఇంకా మూడు సాంగ్స్ షూట్ చేయాల్సి ఉందట. హీరోయిన్లు నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లతో డార్లింగ్ ఓ పాటలో స్టెప్పులేయనున్నాడట. అయితే నిధి, మాళవిక (Malavika Mohanan) ఇతర సినిమాల షూటింగులతో బిజీగా ఉండటం వల్ల ఆ పాటల షూటింగ్ పూర్తవ్వడానికి మరికొంత సమయం పడుతుందని సమాచారం. ప్రభాస్ తొలిసారి హారర్ నేపథ్యంలో నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తొలుత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేస్తామని ప్రకటించి వాయిదా వేశారు. టీజర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.






