Mana Enadu : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ గెడ్ రెడీ. రెబల్ స్టార్ తొలిసారిగా నటిస్తున్న హార్రర్ కామెడీ రాజాసాబ్ (raja saab) నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో కంప్లీట్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం గ్లింప్స్ రిలీజ్ అయి ప్రేక్షకులకు ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రపై అంచనాలు పెంచేశాయి. ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకేతో అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ పంచాడు.
రాజాసాబ్ నుంచి క్రేజీ అప్డేట్స్
ఇక ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల (Raja Saab Release Date) కాబోతోంది. అయితే తాజాగా రాజాసాబ్ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్‌ను క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక మాస్ సాంగ్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన లాంఛ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అప్డేట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్
ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రభాస్ అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్స్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ కావడంతో తెగ సంబురపడిపోతున్నారు. రాజాసాబ్ మోషన్ పోస్టర్ (The Raja Saab Motion Poster) ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇక ఈ మూవీలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్రలో కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.






