డార్లింగ్ మూడ్‌లో ప్రభాస్.. రాజా సాబ్‌లో ఉన్న సీక్రెట్లు చూస్తే ఫ్యాన్స్ కేక!

వరుసగా ఫాంటసీ డ్రామాలు, భారీ యాక్షన్ థ్రిల్లర్స్‌లో నటిస్తున్న ప్రభాస్(Prabhas), ఈసారి విభిన్నంగా కనిపించబోతున్నాడు. మారుతి(Maruthi Director) దర్శకత్వంలో రూపొందుతున్న ‘ ది రాజా సాబ్’(The Raja Saab) చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని సినిమాల్లో లార్జర్-దెన్-లైఫ్ పాత్రలే చేస్తున్న ప్రభాస్, ఈసారి మాత్రం పూర్తిగా డార్లింగ్ మూడ్లోకి మారనున్నాడు.

‘బాహుబలి’(Bahubali) తర్వాత ప్రభాస్ చేసిన సాహో(Saahu), రాధే శ్యామ్(Raade Syam), ఆదిపురుష్(Aadhipurush), సలార్(Salaar), కల్కి 2898 AD లాంటి చిత్రాలన్నీ భారీ బడ్జెట్, విజువల్ గ్రాండియర్‌తో రూపొందాయి. ఇందులో ప్రేమకథ అయిన రాధే శ్యామ్ కూడా విఎఫ్ఎక్స్‌భారీ చిత్రంగానే నిలిచింది. అలాంటి బ్యాక్‌డ్రాప్‌లో మారుతితో చేస్తున్న ‘రాజా సాబ్’ హార్రర్ కామెడీతో పాటు వినోదం అదిరిపోయే డాన్సులు కూడా హైలెట్ కానున్నాయి.

The Raja Saab : Stylish poster of Prabhas unveiled with an update! -  TeluguBulletin.com

తక్కువ బడ్జెట్ మూవీలా కనిపించినా, ఈ చిత్రానికి రూ.200 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. “మంచి రోజులొచ్చాయి” వంటి ప్లాప్ తర్వాత కూడా మారుతిపై నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో ప్రభాస్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైగా ఈ సినిమాతో ప్రభాస్ మళ్లీ డాన్సులకి తిరిగొస్తున్నాడు. చాలా కాలంగా మిస్సయ్యిన అతని రొమాంటిక్ యాంగిల్ ఈ సినిమాలో హైలైట్ కానుంది.

The Raja Saab Teaser: Positives And Negatives - TrackTollywood

మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 2025 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, హార్రర్ కామెడీ జానర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు ‘రాజా సాబ్’ సిద్ధమవుతోంది. అభిమానులు కోరుకున్న పాత డార్లింగ్ ప్రభాస్‌ను మళ్లీ తెరపై చూపించేందుకు మారుతి శ్రమిస్తున్నాడు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *