Mana Enadu: పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్(Rebel star Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో సినీ ఇండస్ట్రీలో ఊహించిన క్రేజ్ సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టీటౌన్(TTown)లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే హను రాఘవపూడి ‘సీతా రామం’, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 ప్రాజెక్ట్స్ వంటి కీ భారీ బడ్జెట్ మూవీలకు కమిట్ అయిన ఈ హీరో త్వరలోనే ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth varma)తో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు టాక్. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్(Hombale Films) నిర్మించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం డార్లింగ్ చేతిలో 4 సినిమాలు
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్(Tollywood) వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 4 భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. మరోవైపు ప్రశాంత్ జై హనుమాన్, నందమూరి మోక్షజ్ఞ(Nandamuri Mokshajna)తో సినిమాలు చేయనున్నాడు. వీటి తర్వాత క్రేజీ కాంబో పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్‌లోకి ఇప్పుడు మరో రెండు సాలిడ్ మూవీస్ రానున్నట్లు సినీ వర్గాల్లో పెద్ద చర్చలు జరుగుతోంది. రానున్న ఏడాది కల్లా లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj)తోనూ సినిమా చేసేందుకు ప్రభాస్ ఆలోచిస్తున్నారట. ఒకవేళ ప్రభాస్ వీరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇక లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU), ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లలో అడుగుపెట్టేసినట్లే. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కనీసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయినా కూడా సినిమా మాత్రం ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే అటు ప్రభాస్ ఇటు లోకేష్ వరుస సినిమాలను కమిట్ అయి ఉన్నారు. అవన్నీ పూర్తి చేయడానికి కనీసం మూడేళ్లయినా పడుతుంది. అప్పటి దాకా డార్లింగ్ ఫ్యాన్స్(Darling fans) వెయిట్ చేయాల్సిందే. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్‌తో కలిసి ప్రస్తుతం ‘కూలీ’ సినిమా చేస్తుండగా.. ప్రభాస్, హను రాఘవపూడి మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. కాగా ఈ కాంబో వర్కౌట్ అయితే బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






