
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నటిస్తున్న భారీ చిత్రం ‘ది రాజాసాబ్ (The Rajasaab)’ విడుదల మరోసారి వాయిదా(Postpone) పడే అవకాశం ఉంది. దీంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. మారుతి(Maruthi) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవికా మోహనన్(Malavika Mohanan), రిద్ధీ కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5, 2025న విడుదల కావాల్సి ఉండగా, వీఎఫ్ఎక్స్ పనులు, ఇతర కారణాలతో 2026 జనవరి 9 సంక్రాంతి(Sankranthi)కి వాయిదా పడినట్లు సినీవర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఒప్పందం ప్రకారం షూటింగ్ పూర్తి కాకపోవడంతో
ఇదిలా ఉండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై ముంబైకి చెందిన IVY ఎంటర్‌టైన్‌మెంట్స్ ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో కేసు నమోదు చేసింది. ఈ సంస్థ ‘ది రాజాసాబ్’ కోసం రూ. 218 కోట్లు పెట్టుబడి పెట్టగా, ఒప్పందం ప్రకారం షూటింగ్ పూర్తి కాకపోవడం, అప్‌డేట్స్ ఇవ్వకపోవడం, డబ్బు వినియోగంపై సమాచారం లేకపోవడంతో మోసం జరిగిందని ఆరోపించింది. 18% వడ్డీ(Interest)తో రూ. 218 కోట్లు తిరిగి చెల్లించాలని, అంతవరకు సినిమా విడుదల నిలిపివేయాలని IVY డిమాండ్ చేసింది.
BREAKING 🚨
Ivy Entertainment has filed a case against People Media Factory, asking for ₹218 crore back.
They claim PMF broke the contract for #TheRajaSaab by delaying the film and not sharing updates or how the money was spent. (Economic Times)
— Movies4u Official (@Movies4u_Officl) August 13, 2025
రిలీజ్ సమయంలో చెల్లింపులు పూర్తి చేస్తాం
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందిస్తూ, నాన్-థియేట్రికల్ డీల్(Non-theatrical deal) ఇంకా క్లోజ్ కాలేదని, షూటింగ్ చివరి దశలో ఉందని, రిలీజ్ సమయంలో చెల్లింపులు పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపింది. IVY సంస్థ తాత్కాలికంగా ఒప్పుకున్నట్లు సమాచారం, కానీ వివాదం పూర్తిగా ముగిసిందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిక్కులతో సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొని, అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు.