టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కేజీయఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashant Neel) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. #NTRNeel వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. #NTR31 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించనున్నట్లు తెలిసింది.
See you in cinemas on 25 June 2026…. #NTRNeel pic.twitter.com/SkMhyaF71c
— Jr NTR (@tarak9999) April 29, 2025
ఎన్టీఆర్31 బిగ్ అప్డేట్
అయితే తాజాగా ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది (2026) సమ్మర్ కానుకగా.. జూన్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను షేర్ చేసి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మరోవైపు ఈ మూవీ సెట్స్‌లో ఎన్టీఆర్ ఇప్పటికే అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు.






