Mana Enadu : టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (Prashant Varma Cinematic Universe) లో భాగంగా యంగ్ టాలెంట్ తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా హను-మాన్. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
జై హనుమాన్ పాత్రలో కాంతార హీరో
జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి (Rishab Shetty) హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నాడని చెప్పినట్లుగా ఫస్ట్ లుక్ తో అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ అప్డేట్ తో ఈ సినిమాపై ఆడియెన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక అక్టోబర్ 30న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ‘జై హనుమాన్ (Jai Hanuman) ‘ థీమ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు.
జై హనుమాన్ థీమ్ సాంగ్ రిలీజ్
ఈ థీమ్ కు ఓజెస్ స్వరాలు సమకూర్చగా.. కల్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy) సాహిత్యం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతోంది. ఇక ఆలస్యం చేయకుండా గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘జై హనుమాన్’ సినిమా ఫస్ట్ లుక్ థీమ్ సాంగ్ మీరు కూడా వినేయండి.
పీవీసీయూలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు
ఇక ‘జై హనుమాన్’ సినిమా సంగతికి వస్తే.. ఈ చిత్రంలో శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేంటన్నది కీలకంగా చూపించనున్నారు. ‘హను-మాన్’లో హనుమంతుగా కనిపించిన తేజ (Teja Sajja) కొత్త సినిమాలోనూ అదే పాత్ర పోషించనున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగమే. అయితే ‘జై హనుమాన్’ కంటే ముందు తన యూనివర్స్ నుంచి ‘అధీర’, ‘మహాకాళి’ విడుదలవుతాయని ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పుకొచ్చారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Mokshgna)ను వెండితెరకు పరిచయం చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో ప్రశాంత్ వర్మ ఫుల్ బిజీగా ఉన్నారు.