Mana Enadu : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ (Atal Bihari Vajpayee) శత జయంతి సందర్భంగా దిల్లీలోని ‘సదైవ్ అటల్’ వద్ద ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా(Amit Shah), జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu), పలువురు ఎంపీలు వాజ్‌పేయీకి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు.
VIDEO | President Droupadi Murmu, Vice President Jagdeep Dhankhar, Prime Minister Narendra Modi, Former President Ram Nath Kovind, Home Minister Amit Shah, Lok Sabha Speaker Om Birla, and other leaders pay tribute to former PM Atal Bihari Vajpayee during his centenary birth… pic.twitter.com/oBDQnHs2mP
— Press Trust of India (@PTI_News) December 25, 2024
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వాజ్‌పేయీ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన దూర దృష్టి వల్లే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని అన్నారు. వాజ్‌పేయీ జయంతి సందర్భంగా ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. భారతజాతి గర్వించదగిన నేత వాజ్‌పేయీ అని కొనియాడారు. దేశం గురించి ఆలోచించే తీరు విలక్షణమైనదని కితాబిచ్చారు. సంస్కరణల ప్రతిపాదనలపై వాజ్‌పేయీ స్పందించిన తీరు ఎన్నటికీ మరచిపోలేనని తెలిపారు. ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాను అని చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పోస్టులో పేర్కొన్నారు.






