RTA Telangana: తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్ల ధరలు భారీగా పెరిగాయ్!

తెలంగాణ రవాణాశాఖ(Telangana Transport Department) ఫ్యాన్సీ నంబర్(Fancy number) ప్లేట్ల ధరలను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వాహనదారులు తమకు ఇష్టమైన ప్రత్యేక నంబర్ల కోసం ఇకపై రెట్టింపు లేదా మూడింతల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. రవాణాశాఖ జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్(Basic notification) ప్రకారం, అత్యంత డిమాండ్ ఉన్న “9999” నంబర్ ధర గతంలో రూ.50,000గా ఉండగా, ఇప్పుడు రూ.1.50 లక్షలకు పెరిగింది. అలాగే, “6666” నంబర్ ధర రూ.30,000 నుంచి రూ.1 లక్షకు, “1” లేదా “9” వంటి నంబర్లు రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెరిగాయి. ఇతర ప్రత్యేక నంబర్ల ధరలు రూ.6,000 నుంచి రూ.50,000 వరకు సవరించారు. ఈ ధరల పెంపు రవాణాశాఖకు ఆదాయా(Income)న్ని గణనీయంగా పెంచనుంది.

ఆదాయం మరింత పెరిగే అవకాశం

గతంలో ఫ్యాన్సీ నంబర్ల ద్వారా ఏటా రూ.100 కోట్లకు పైగా సమకూరగా, ఈ పెంపుతో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నంబర్లకు ప్రముఖులు, వ్యాపారవేత్తలు (Businessmen), సెలబ్రిటీల నుంచి భారీ డిమాండ్ ఉంది, ముఖ్యంగా ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో అన్ని దరఖాస్తులు ఇకపై ఆన్‌లైన్‌(Online)లోనే స్వీకరించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఒకే నంబర్‌కు బహుళ దరఖాస్తులు వస్తే మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య ఆన్‌లైన్ వేలం జరుగుతుంది. నంబర్ రిజర్వ్ చేసిన 15 రోజుల్లో వాహనం రిజిస్ట్రేషన్ చేయకపోతే రిజర్వేషన్ రద్దవుతుంది. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల కోసం 30 రోజుల సమయం ఇచ్చారు. ఈ నిర్ణయం వాహనదారులపై ఆర్థిక భారం పెంచినప్పటికీ, రవాణాశాఖ ఆదాయాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *