ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘మహా కుంభమేళా(Maha Kumbhamela)’ అట్టహాసంగా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో గత నెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే వేలాదిగా తరలి వచ్చిన భక్తులు గంగా, యమునా, సర్వసతి నదులు కలిసే చోటైన త్రివేణీ సంగమం(Triveni Sangam) వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాకు సాధవులు, సాధ్వీలు, నాగసాధువులు, కల్పవాసీలు భారీగా హాజరవుతున్నారు. తాజాగా ప్రధాని మోదీ సైతం రేపు (జనవరి 5) కుంభమేళాను సందర్శించనున్నారు.
అరయిల్ ఘాట్ నుంచి సంగం వరకూ
ఈ నేపథ్యంలో ప్రధాని రాకకోసం UP అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ(PM Modi) రేపు ఉదయం 10 గంటలకు మహాకుంభ్(Maha Kumbh)కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి ఆయన అరయిల్ ఘాట్(Arail Ghat) నుంచి పడవ ద్వారా సంగం(Sangham) వెళ్తారు. ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు గంటసేపు ఉంటారు. మహా కుంభమేళాకు ముందు, 2024 డిసెంబర్ 13న, ప్రధానమంత్రి సంగం ఒడ్డున గంగా నదికి హారతి(Obeisance to the river Ganges), పూజలు నిర్వహించి, ఈ మెగా ఈవెంట్ విజయవంతంగా పూర్తి కావాలని ప్రార్థించారు. ఆయన 2019 సంవత్సరం కుంభమేళా ప్రారంభంలో, తరువాత కూడా హాజరై గంగమ్మ తల్లికి హారతులు సమర్పించారు. కాగా రేపటికోసం ప్రయాగ్‌రాజ్, త్రివేణీ సంగమం వద్ద పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు.






