ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈ రోజు మహా కుంభమేళా(Maha Kumbh)లో పాల్గొననున్నారు. త్రివేణీ సంగమం(Triveni Sangamam)లో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తారు. అనంతరం గంగాదేవికి ప్రార్థనలు చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. అటు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో UP CM యోగి ఆదిత్యనాథ్ మంగళవారం రాత్రే ప్రయాగ్ రాజ్(Prayagraj) మహా కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. కాగా మోదీ ఉదయం 10 గంటలకు ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి అరైల్(Arile Ghat) ఘాట్‌కు వెళ్తారు. 11 గంటలకు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తారు.
దాదాపు 40 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు
అనంతరం ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంకు వెళ్లి ఢిల్లీ(Delhi)కి తిరుగు ప్రయాణం అవుతారు. మోదీ రాక నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ నగరంతో పాటు కుంభమేళా వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు(Police heavy security) చేశారు. కాగా జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభం కాగా, భారత్‌తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు(Devotees) హాజరవుతున్నారు. ఇప్పటి వరకు 40 కోట్ల మందికిపైగా కుంభమేళాకు వచ్చినట్లు UP ప్రభుత్వం తెలిపింది. సామాన్య భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

తొక్కిసలాట ఘటనపై పిల్
కాగా మహా కుంభమేళాలో జనవరి 29న మౌని అమావాస్య(Mouni Amavasya) సందర్భంగా తొక్కిసలాట(Stampede) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడినట్లు యూపీ సర్కారు వెల్లడించింది. అయితే ఈ ఘటనకు యూపీ ప్రభుత్వ అధికారులే కారణం అంటూ ఓ న్యాయవాది సుప్రీం కోర్టు(Supreme Court)లో పిల్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఆ పిల్(Pill)ను తిరస్కరించింది.






