ఓటీటీలో ఇప్పటికే భామాకలాపం(Bhamakalapam) సీరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియమణి(Priyamani) ఇప్పుడు తాజాగా “గుడ్ వైఫ్(Good Wife)”తో ముందుకొచ్చి శభాష్ అనిపించుకుంటోంది. ప్రియమణి ప్రధానమైన పాత్రగా ఈ సిరీస్ రూపొందింది. రేవతి(Revathi) దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్‌గా ‘జియో హాట్ స్టార్(JIO HOTSTAR)’లో స్ట్రీమింగ్ కి వచ్చింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠి భాషలలో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. జులై 4 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్(Web Series) చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని, ప్రియమణి తన నటనతో అదరగొడుతుందనే టాక్ వినిపిస్తోంది.
లాయర్‌గా భార్య ఏం చేసిందనేదే కథ
సీనియర్ నటి రేవతి ఈ సీరీస్‌ను అమెరికా షో(America Show) ఆధారంగా చేసుకుని నిర్మించారు. భర్త ఒక సెక్స్ వీడియో(Sex Video Case)లో బుక్ అవ్వడంతో భార్య లాయర్‌గా ఎలా కథను మలుపు తిప్పుతనేది ఈ సీరీస్ సారాంశం. గుడ్ వైఫ్.. పేరుతో జియో హాట్ స్టార్‌లో మొదలైన సిరీస్ అద్భుతంగా ఉందనే టాక్ వచ్చింది. కానీ ఈ సీరీస్‌లో చాలా మార్పులు ఉన్నాయి. ఇక్కడ నేటివిటీకి తగ్గట్టు చిత్ర నిర్మాణం చేశారు. భర్తగా సంపత్ రాజ్(Sampath Raj) నటించగా, భార్యగా ప్రియమణి నటించింది.

తరుణిక ఎలాంటి పోరాటం చేసింది?
అడిషనల్ అడ్వొకేట్ జనరల్ గుణ శీలన్ (Sampath Raj), తరుణిక(Priyamani)లది అన్యోన్య దాంపత్యం. వీరికి ఇద్దరు సంతానం. అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆ జంటే.. తర్వాత అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సెక్స్ కుంభకోణం ఆరోపణలతో గుణ జైలు పాలవుతాడు. అది నిజమో, కాదో తెలియకుండానే భర్తను అసహ్యించుకుంటుంది తరుణిక. తన స్నేహితుడి సాయంతో ఎల్‌ఏహెచ్ అనే ‘లా’ సంస్థలో అసోసియేట్ అడ్వొకేట్‌గా జాయిన్ అవుతుంది. న్యాయ పోరాటంలో భాగంగా భర్త కోసమే ఆమె ఈ వృత్తిలోకి తిరిగొచ్చిందని అందరూ అనుకుంటారు. మరి, తరుణిక ప్లాన్ అదేనా? గుణ జైలు నుంచి ఎలా బయటకు వచ్చాడు?అసలు అతడు తప్పు చేశాడా? కేవలం అవి ఆరోపణలేనా? అయితే ఇల్లు, కోర్టు, జైలు ఇలా వీటన్నింటినీ మ్యానేజ్ చేస్తూ భర్తను ఆ కేసు నుంచి బయటకు ఎలా తీసుకొస్తుందనేది ఈ సీరీస్ సారాంశం. ఇందులో ప్రియమణి అద్భుతంగా నటించింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ గుడ్ లైఫ్‌ని హాట్ స్టార్‌లో చూసేయండి.
#GoodWife has a spectacular Priyamani
But there is nothing else to appreciate
This @JioHotstar series is inconsistent in so many ways that it is annoying
Our review 👇👇https://t.co/vxqARmFbqb
— BINGED (@Binged_) July 5, 2025






