OG Movie: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజీత్(Sujith) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ గ్యాంగస్టర్ డ్రామా ‘ఓజీ(OG)’ సినిమా నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంకా మోహన్(Priyanka Mohan) ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రియాంక ‘కన్మణి(Kanmani)’ అనే పాత్రలో కనిపించనుంది. చీరకట్టు, నుదుటన బొట్టు, మెడలో నల్లపూసల దండతో కనిపించే ప్రియాంక లుక్(First Look) అభిమానులను ఆకట్టుకుంది. ఈ పాత్ర ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

అభిమానుల్లో భారీ అంచనాలు

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ‘ఓజస్ గంభీర’ అనే శక్తివంతమైన గ్యాంగస్టర్ పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంక లుక్‌తో పాటు, చిత్ర బృందం రెండవ సింగిల్ ప్రోమో(Promo)ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది, ఇది అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. సుజీత్ దర్శకత్వంలో, ఎస్. తమన్(S Thaman) సంగీతంతో, రవి కె. చంద్రన్, మనోజ్ పరమహంస ఛాయాగ్రహణంతో రూపొందుతున్న ఈ సినిమా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఇమ్రాన్ హష్మి(Imaran Hashmi), అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్(Prakash Raj), శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంకా మోహన్ పాత్ర పవన్ కల్యాణ్ గ్యాంగస్టర్ కథకు భావోద్వేగంతో కూడిన ట్విస్ట్‌ను అందించనుంది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *