ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 11వ సీజన్(Season 11) పోటీలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. శనివారం (నవంబర్ 30) జరిగిన 86వ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్(Telugu Titans)పై జైపూర్ పింక్ పాంథర్స్(Jaipur Pink Panthers) గెలుపొందింది. నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జైపూర్ 41-28 తేడాతో టైటాన్స్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. గేమ్ ప్రారంభం నుంచే ఎటాకింగ్‌కు దిగిన ఇరుజట్లు హాఫ్ టైమ్ ముగిసే సరికి 18-18తో సమంగా నిలిచాయి. కానీ సెకెండ్ హాఫ్‌లో పాంథర్స్ ప్లేయర్లు చెలరేగారు. అదే దూకుడును చివరి వరకూ కొనసాగించారు. ఈ క్రమంలో బెంగళూరుపై 13 పాయింట్ల తేడాతో గెలుపొంది. ఈ మ్యాచులో జైపూర్ 22 రైడ్ పాయింట్స్, 12 టాకిల్ పాయింట్స్, 6 సార్లు ఆలౌట్ పాయింట్లు సాధించింది.
బుల్స్‌కు షాకిచ్చిన పట్నా
ఇదిలా ఉంటే ఇదే వేదికపై జరిగిన మరో మ్యాచులో పట్నా పైరేట్స్(Patna Pirates) 54-29తో బెంగళూరు బుల్స్(Bengaluru Bulls)పై విజయం సాధించింది. దేవాంక్(17) పట్నా విజయంలో కీలకంగా వ్యవహరించాడు. రైడింగ్‌లో (34 పాయింట్లు) టాకిల్స్(Tackles)లో 13 పాయింట్లు సాధించి పట్నా ప్లేయర్లు అదరగొట్టారు. ఆరు సార్లు బెంగళూరు బుల్స్‌ను ఆలౌట్ చేయడంతోపాటు ఒక ఎక్స్ట్రా పాయింట్ సాధించడంతో బుల్స్ పై విజయం సాధించింది. కాగా రేపు తమిళ్ తలైవాస్‌తో దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్‌తో పట్నా పైరేట్స్ తలపడనున్నాయి.
ఆదివారం రెండు మ్యాచ్‌లు
కాగా రేపు రాత్రి 8 గంటలకు జరిగే మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు తమిళ్ తలైవాస్(Dabang Delhi vs Tamil Thalaivas)తో, రాత్రి 9 గంటలకు జరగనున్న మరో మ్యాచులో పుణేరి పల్టాన్స్ జట్టు హరియాణా స్టీలర్స్(Patna Pirates vs Bengal Warriors)తో తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో హరియాణా స్టీలర్స్ టాప్‌లో ఉండగా, తెలుగు టైటాన్స్ రెండో ప్లేస్‌లో ఉన్నాయి.
Game day memories hit different 📸✨
For more images ➡️ visit https://t.co/cfORnVakqn or the Pro Kabaddi Official App 📱#ProKabaddi #PKL11 #LetsKabaddi #ProKabaddiOnStar #PatnaPirates #BengaluruBulls #JaipurPinkPanthers #TeluguTitans pic.twitter.com/8ci8R5HRJs
— ProKabaddi (@ProKabaddi) November 30, 2024