ఈ నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్(Ahmadabad)లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన(Air India plane crash) విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతులు, DNA పరీక్షలు, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ గురించి తాజాగా అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్(Ahmedabad Civil Hospital) కీలక ప్రకటన చేసింది. విమాన ప్రమాదానికి సంబంధించి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయైనట్లు అధికారులు తెలిపారు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఆఖరి మృతదేహాన్ని(Last Dead Body) గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్యను 260గా తేల్చారు. విమానంలోని 241 మంది సహా మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తొలుత అంచనా వేసినప్పటికీ.. చివరకు 260గా నిర్ధరించారు.
దాదాపు రెండు వారాల తర్వాత
కాగా, జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్(London) బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకున్న కాసేపటికే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్(Medical College Hostel)పై కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఒకరు మినహా మిగతా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలంలో ఉన్న పలువురూ మృతి చెందారు. శరీరాలు గుర్తుపట్టరాని విధంగా మారడంతో.. అధికారులు డీఎన్‌ఏ పరీక్షలు(DNA Tests) నిర్వహించారు. దాదాపు రెండు వారాల తర్వాత ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చింది.
ఆఖరి మృతదేహానికి డీఎన్‌ఏ మ్యాచింగ్ పూర్తి
‘‘విమాన ప్రమాదానికి సంబంధించి ఆఖరి మృతదేహానికి డీఎన్‌ఏ మ్యాచింగ్ పూర్తయ్యింది. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించాం’’ అని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.రాకేశ్ జోషి(Doctor Joshi) తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 260కి చేరినట్లు వెల్లడించారు. అందరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. గాయాలపాలైన మరో ముగ్గురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కాగా 260 మంది మృతుల్లో 200 మంది భారతీయులు(Indians), 52 మంది బ్రిటిష్ పౌరులు(British citizens), ఏడుగురు పోర్చుగల్(Portuguese), ఒకరు కెనడియన్(Canadian) ఉన్నట్లు చెప్పారు.
#AhmedabadPlaneCrash: More than two weeks after the Ahmedabad plane crash, the DNA test has ascertained the identity of the last victim, and the death toll in the tragedy now stands at 260.
The remains of the last victim were handed over to the family, they said.#PlaneCrash pic.twitter.com/XF8U0mXOlp
— Soundar C / சௌந்தர் செ (@soundarc2001) June 28, 2025







