వెంకీ అట్లూరితో మోక్షజ్ఞ మూవీ.. కన్ఫామ్ చేసిన ప్రొడ్యూసర్

Mana Enadu : నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో డెబ్యూ ఫిక్స్ అయింది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. పురాణాలు, ఇతిహాసాల బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. డిసెంబరు 5న పూజా కార్యక్రమం జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది.

మోక్షజ్ఞ రెండో సినిమా ఫిక్స్

ఫస్ట్ సినిమా నుంచి మరో అప్డేట్ లేకపోయినా  మోక్షజ్ఞ (Mokshagna Teja Movie) రెండో సినిమా గురించి మాత్రం కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మోక్షజ్ఞ తన రెండో సినిమా చేయనున్నట్లు టాక్ వినిపించింది. ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రానుందని నిర్మాత నాగవంశీ (Naga Vamshi) తెలిపారు. వెంకీ అట్లూరి- మోక్షజ్ఞ సినిమా గురించి తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు.

మోక్షజ్ఞ మూవీపై నాగవంశీ క్లారిటీ

వెంకీ అట్లూరిపై బాలకృష్ణకు చాలా నమ్మకం ఉందని.. అందుకే ఆయన కాంబోలో ప్రాజెక్టును ఓకే చేశారని నాగవంశీ తెలిపారు. లక్కీ భాస్కర్ సినిమా చూసి వెంకీ పనితనాన్ని మెచ్చుకున్నారని చెప్పారు. వెంకీ టేకింగ్ పై ఎంతో నమ్మకం ఉన్నట్లు బాలయ్య చెప్పినట్లు నాగవంసీ వెల్లడించారు. తానే మోక్షు రెండో సినిమాను నిర్మించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సంక్రాంతికి బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *