DC vs PBKS: టాస్ నెగ్గిన పంజాబ్.. బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయస్

IPL 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్(PBKS) టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ధర్మశాల(Dharmashala) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచుకు తొలుత వరుణుడు టాస్‌(Toss)కి ఆటంకం కల్పించాడు. దీంతో రాత్రి 8.15కి అంపైర్లు టాస్ వేశారు. కాగా ఈ మ్యాచులో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్(Playoffs) అవకాశాలను మరింత మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుంది. ఒక ఈ మ్యాచులో పంజాబ్ సేమ్ టీమ్‌తో ఆడుతుండగా.. ఢిల్లీ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. విప్రాజ్ నిగమ్, కరుణ్ నాయర్ స్థానంలో మాధవ్ తివారీ, సమీర్ రిజ్వీ జట్టులోకి వచ్చారు. కాగా ఈ మ్యాచుకు వరుణుడు అంతరాయం కల్పించే అవకాశం ఉంది.

వర్షం పడితే ఢిల్లీకే లాభం

ఒకవేళ ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ జరిగి ఆ తర్వాత వర్షం పడినప్పటికీ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ రద్దయితే PBKS కంటే DCకే ఎక్కువ లాభం ఉంది. ఈ మ్యాచ్‌లో PBKS గెలిస్తే IPL 2025 ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టే తొలి జట్టుగా నిలుస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే మూడో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకి చెరొక పాయింట్ దక్కనుంది. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లతో ఐదో స్థానంలోనే ఉండగా, పంజాబ్ 16 మూడో స్థానంలోనే ఉంటుంది. కాగా ఐపీఎల్‌లో ఇరు జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరగ్గా.. పంజాబ్ కింగ్స్ 17, ఢిల్లీ క్యాపిటల్స్ 15 మ్యాచ్‌లలో గెలిచాయి. ఒక మ్యాచ్ రద్దయింది.

తుది జట్లు ఇవే..

ఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(Wk), KL రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(C), ట్రిస్టన్ స్టబ్స్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, T నటరాజన్

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (C), జోష్ ఇంగ్లిస్ (Wk), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *