
IPL 2025 సీజన్‌లో పంజాబ్ ఫైనల్ చేరింది. అవును ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్(MI)ను 5 వికెట్ల తేడాతో పంజాబ్(PBKS) చిత్తు చేసింది. దీంతో 2014 తర్వాత తొలిసారి ఆ జట్టు ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఆదివారం వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన క్వాలిఫయర్-2 మ్యాచులో ముంబై ఇండియన్స్‌తో పంజాబ్ తలపడింది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 203/6 పరుగులు చేసింది. రోహిత్ (8) విఫలమైనా.. బెయిర్ స్టో (38), తిలక్ వర్మ (44), సూర్య కుమార్ (44), పాండ్య (15), నమన్ ధీర్ (37) రన్స్ చేశారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా 2, జెమీసన్, స్టొయినిస్, విజయ్ కుమార్, చాహల్ తలో వికెట్ తీశారు.
SHREYAS IYER – ONE OF THE GREATEST LEADERS OF THIS LEAGUE. 🥶
– PBKS in an IPL Final after 11 years.#ipl #IPL2025 #MIvPBKS #MIvsPBKS #PBKSvMI #pbksvsmi #ipl25 #IPLPlayoffs #IPLQualifier #ENGvsWI #RCBvsPBKS pic.twitter.com/SGYw1tcXmt
— IPL 2025 (@bgt2025) June 2, 2025
అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్..
అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 13 వద్ద ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (6) ఔటయ్యాడు. మరో ఓపెనర్ ప్రియాన్ష్ (20) రన్స్ చేసి ఔటయ్యాడు. అనంతరం ఇంగ్లిస్ (38) సాయంతో అయ్యర్(Shreyas Ayyar) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 41 బంతుల్లో 87* రన్స్‌తో మెరుపులు మెరిపించాడు. ఇంగ్లిస్ ఔటయ్యాక నెహాల్ వధేరా (48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో సిక్సర్ బాది పంజాబ్‌కు అయ్యర్ చిరస్మరణీయ విజయం అందించాడు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 2, బౌల్ట్, పాండ్య చెరో వికెట్ తీశారు. సూపర్ ఇన్నింగ్ ఆడిన అయ్యర్‌కు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది. కాగా రేపు ఇదే అహ్మదాబాద్(Ahmadabad) వేదికపై జరిగే ఫైనల్లో RCBని పంజాబ్ ఢీకొట్టనుంది. ఇందులో ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్ కావడం గమనార్హం.
Shreyas Iyer! 🫡#MI को धो डाला
Well done 🔥 #ShreyasIyer @dreamgovteacher pic.twitter.com/UXksf7HoNU— dream govt. teacher (Jain) (@dreamgovteacher) June 2, 2025