PBKSvsRR: ప్లేఆఫ్స్‌కు చేరువైన పంజాబ్.. RRపై 10 రన్స్ తేడాతో గెలుపు

IPL 2025లో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌(RR)పై పంజాబ్ కింగ్స్(PBKS) 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ నెగ్గిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 219/5 భారీ స్కోరు సాధించింది. ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 209/7 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో పంజాబ్ 12 మ్యాచుల్లో 17 పాయింట్లతో పట్టికలో సెకండ్ ప్లేస్‌(Second Place)కు దూసుకెళ్లింది. అటు రాజస్థాన్ ఆడిన 13 మ్యాచుల్లో పదింట్లో ఓడి చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.

అదరగొట్టిన వధేరా..

జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ నెగ్గిన పంజాబ్(PBKS) తొలుత బ్యాటింగ్ చేసింది. నేహాల్ వధేరా (70), శశాంక్ సింగ్ (59) పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తోపాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30), అజ్మతుల్లా (21), ప్రభ్ సిమ్రన్ సింగ్ (21) పరుగులు చేయడంతో 219 పరుగులు సాధించింది. రాయల్స్(RR) బౌలర్లలో దేశ్ పాండే 2, మఫాకా, మధ్వాల్ చెరో వికెట్ తీశారు.

జైస్వాల్, ధ్రువ్, వైభవ్ పోరాడినా..

అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్లు జైస్వాల్ (50), వైభవ్ (40) మెరుపు ఆరంభాన్ని అందించారు. అయితే వీరిద్దరూ ఔటయ్యాక సంజూ శాంసన్(20), పరాగ్ (13), హెట్‌మయర్ (11) నిరాశపర్చారు. మిడిల్ ఆర్డర్‌లో ధ్రువ్ జురెల్ (53) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. దీంతో రాయల్స్ విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచింది. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ 3 వికెట్లు తీయగా, జాన్సెన్, ఓమర్జాయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Image

ఇదిలా ఉండగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గుజరాత్ టైటాన్స్(DC vs GT) తలపడుతోంది. ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ టాస్(Toss) నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *